

2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాలోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. భువీ తన పునరాగమనంపై స్పందించాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించిన అతడు 28 వికెట్లు పడగొట్టి జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్‌కు నాయకత్వం వహించనున్న భువనేశ్వర్.. భారత్ తరఫున ఆడే అవకాశం వస్తే ఎందుకు వద్దంటానని అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని స్పష్టం చేశాడు. అయితే తాను ఎంతవరకు సిద్ధంగా ఉన్నాననేది కచ్చితంగా చెప్పలేనని, తనను జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా అనేది పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన దృష్టి క్రికెట్ ఆడటంపైనే ఉందని భువీ తెలిపాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!