
సినిమాలు

ఈ సీజన్ బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మహిళల విభాగంలో 11 ఏళ్ల బోధనా శివానందన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్లేఆఫ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యామరాలను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో బ్రిటన్‌లో పిన్న వయసులోనే మహిళా చెస్ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారిణిగా బోధనా రికార్డు సృష్టించింది.
ఇక ఓపెన్ విభాగంలోనూ భారత సంతతి ఆటగాడైన 17 ఏళ్ల శ్రేయాస్ రాయల్ విజేతగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని దక్కించుకున్నాడు. 122 ఏళ్ల బ్రిటన్ చెస్ చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ చాంపియన్‌షిప్‌లో మహిళల, ఓపెన్ విభాగాల రెండు టైటిళ్లనూ భారత సంతతి ఆటగాళ్లు గెలుచుకోవడం విశేషంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!