
బిజినెస్

క్రికెట్ మైదానంలో తనదైన ముద్ర వేసిన భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. పన్నుల చెల్లింపులోనూ మరో ఘనత సాధించినట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరాఖండ్‌లో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా పంత్ నిలిచినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.23.84 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు సమాచారం.
మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు భారీ కార్పొరేట్, పారిశ్రామిక రంగాల కారణంగా మొత్తం పన్నుల వసూళ్లలో ముందంజలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత పన్ను చెల్లింపుల పరంగా పంత్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్న పంత్.. ఇప్పుడు భారీ మొత్తంలో పన్ను చెల్లించిన అంశంతోనూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!