

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తన రూపం, బరువుపై కామెంట్లు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. పెళ్లి, పాప పుట్టిన తర్వాత ఆమె కాస్త బరువు పెరగడంతో కొంతమంది నెటిజన్లు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్వరా.. ఒకరి బరువు గురించి మాట్లాడటానికి అంత సమయం ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. తన జీవితం ఇతరుల మాటల ఆధారంగా నడవదని స్పష్టం చేశారు.
తల్లి అయిన తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావడం సహజమని స్వరా గుర్తుచేశారు. సినిమాల్లో అందంగా కనిపించేందుకు సర్జరీలు, ఇంజెక్షన్లు చేయించుకోవడం సాధారణమే అయినా, వయసుతో పాటు రూపురేఖలు మారడం సహజమని అన్నారు. గతంలో తన భర్త ఫహద్‌తో బయటకు వెళ్లిన సమయంలో మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను కావాలనే వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి విమర్శలకు తాను భయపడేది లేదని, ట్రోలింగ్ కారణంగా బరువు తగ్గబోనని స్వరా స్పష్టం చేశారు. మహిళలు ఏ రంగంలో ఉన్నా ఇలాంటి అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!