
జనరల్

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఈ నివాస సముదాయాన్ని నిర్మించారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణ పనులు పూర్తికావడంతో సీఎం భవన సముదాయాన్ని పరిశీలించారు.
సీఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం 288 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో అధునాతన సౌకర్యాలతో రూపొందించారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫ్లాట్లను సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్‌తో కలిసి పరిశీలించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!