

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను సందర్శించారు. సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆటగాళ్ల గాయాలు, వారికి అందుతున్న సదుపాయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సీవోఈ అభివృద్ధిలో మాజీ బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ జై షా పోషించిన కీలక పాత్రను సైకియా, లక్ష్మణ్ గుర్తుచేశారు.
దాదాపు 40 ఎకరాల బంజరు భూమిని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో జై షా కీలకంగా వ్యవహరించారని సైకియా తెలిపారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌తో చర్చించి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆయన పట్టుబట్టారని చెప్పారు. భూమి, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు జై షా పలుమార్లు వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని వివరించారు. కేవలం రెండేళ్లలో అత్యుత్తమ మౌలిక వసతులతో సీవోఈని సిద్ధం చేయగలిగామని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభం కాగా, 2024 నవంబర్‌లో సీవోఈ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!