

దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమ్‌ఇండియా తలుపులు ఇంకా తెరుచుకోలేదు. వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మేనేజ్‌మెంట్ ఇప్పటికే యువ బౌలర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో షమీకి చోటు దక్కలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్ షమీకి మద్దతుగా నిలిచాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశలను వదులుకోవద్దని సూచించాడు.
క్రికెటర్‌గా ముందుకు సాగేందుకు ఆటగాడి దృక్పథమే కీలకమని జహీర్ పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్ ఆలోచనలు భిన్నంగా ఉన్నా, మ్యాచులు ఆడుతూ మంచి ప్రదర్శన చేస్తే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లేనని చెప్పాడు. షమీ ఇప్పటికీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడని, అవకాశం రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. పేసర్ల గాయాలపై స్పందిస్తూ.. టోర్నీలు, మ్యాచ్‌ల అవసరాలకు అనుగుణంగా వర్క్‌లోడ్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, గాయాల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!