

ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో పాలస్తీనా ఆటగాళ్ల తీరుపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అండర్-17 ఆసియా కప్ బెర్తు కోసం జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్‌లో భారత్, పాలస్తీనా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషం నుంచే పాలస్తీనా ఆటగాళ్లు భారత ప్లేయర్ల పట్ల దూకుడుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత ఆటగాడు రాజ్ వాహెంగ్‌బామ్‌ను పాలస్తీనా ప్లేయర్ జమ్‌హర్ దురుసుగా కిందకు నెట్టడమే కాకుండా కాలితో తన్నినట్లు తెలిసింది. దీంతో రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపించి మైదానం నుంచి బయటకు పంపించాడు. ప్రథమార్ధం ముగిసే సమయంలో భారత కెప్టెన్ దల్లాల్‌మౌన్ గాంగ్టెను ఉద్దేశించి మరో పాలస్తీనా ఆటగాడు దుర్వాసన వస్తోందన్నట్లుగా వివాదాస్పద సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత ఫుట్‌బాల్ సమాఖ్య.. పాలస్తీనా ఆటగాళ్లు జాతి వివక్షకు పాల్పడ్డారంటూ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC)కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీని పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యర్థి ఆటగాళ్ల దూకుడు, వివాదాస్పద ప్రవర్తనతో ఒత్తిడి ఎదురైనా భారత జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన ఆటతీరుతో పాలస్తీనాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్‌లో బెర్తు దక్కించుకునేందుకు భారత్ మరింత చేరువైంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!