
జనరల్

భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. న్యూచండీగఢ్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మూడో, చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో ఈ చర్యలు తీసుకుంది. సమయ సడలింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భారత్ నాలుగు ఓవర్లు, వెస్టిండీస్ రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో వేయాల్సిన ప్రతి ఓవర్ తక్కువైనందుకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఇరు జట్ల కెప్టెన్లు తప్పిదాన్ని అంగీకరించి జరిమానాను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా చర్యలు పూర్తయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!