

తేజ సజ్జ తొలిసారి రియాలిటీ షో హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’లో ఆయన 20 మంది ప్రముఖులను మోసం, వ్యూహాలు, మైండ్ గేమ్స్‌తో కూడిన ఆసక్తికరమైన ఆటలో నడిపించనున్నారు. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ పది ఎపిసోడ్‌ల సిరీస్ అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఫార్మాట్‌ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా అందిస్తోంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ షోలో చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి, విద్యు రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి తదితరులు పాల్గొంటున్నారు. ఎవరు నమ్మదగినవారు, ఎవరు రహస్యంగా ఇతరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో తెలుసుకునే క్రమంలో కంటెస్టెంట్లు పొత్తులు, వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగనున్నారు. తాను కూడా కంటెస్టెంట్ల మాదిరిగానే ఈ ఆటలో ప్రతి మలుపును ఊహించలేనని తేజ సజ్జ తెలిపారు. ట్రైలర్‌లో ఆయన ప్రశాంతమైన, అధికారికమైన హావభావాలతో పాటు స్టైలిష్ లుక్ హోస్ట్‌గా కొత్త ఆకర్షణను తీసుకొచ్చింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!