22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

Writer: Pooja 11:55 PM, 21 నవంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

బిగ్‌బాస్ 10లో 76వ రోజు వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగుతూనే పలు ఆసక్తికర పరిణామాలతో ఉత్కంఠ రేపింది. కొందరిని అభినందించిన నాగార్జున.. మరికొందరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. సీజన్ ముగియడానికి మరో నాలుగు వారాలే ఉండటంతో హౌస్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారుతోంది. ముందుగా డిక్టేటర్‌గా ముఖేశ్ పనితీరుకు ఎన్ని మార్కులు ఇస్తారని అతడి టీమ్ సభ్యులను నాగార్జున అడిగాడు. చర్చించిన అనంతరం వారు మొత్తం 50 మార్కులు ఇచ్చారు. మరోవైపు, త్రిగుణ్ టీమ్ సభ్యులు అతడికి ఏకంగా 90 మార్కులు కేటాయించారు. డిక్టేటర్‌గా త్రిగుణ్ ఎంతో చక్కగా వ్యవహరించాడని ప్రశంసించారు. అయితే, త్రిగుణ్‌కు 90 మార్కులు ఇవ్వడం సరికాదని ముఖేశ్ అభిప్రాయపడ్డాడు. దీంతో నాగార్జున ప్రేక్షకుల్లో ముఖేశ్‌ను ఇష్టపడేవారిని అడిగి అతడి పనితీరుకు మార్కులు వేయించాడు. వారు కేవలం 30 మార్కులే ఇవ్వడంతో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు, త్రిగుణ్ డిక్టేటర్‌గా తీసుకున్న నిర్ణయాలు అతడి వ్యూహాత్మక ఆలోచనకు నిదర్శనంగా నిలిచాయి. నీతూ స్థానంలో అమన్‌ను తీసుకోవడం, అమన్ కెప్టెన్ కావడం వంటి పరిణామాలు అతడి ప్రణాళికను నిరూపించాయి. నీతూ కూడా ఆటలో తన సత్తా చాటింది. అయితే, త్రిగుణ్ మాటతీరు కొంత కఠినంగా ఉంటోందని టీమ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ.. నోటి దురుసు తగ్గించుకోవాలని సూచించాడు.

గతంలో జరిగిన డిక్టేటర్ టాస్క్‌లో ముఖేశ్ టీమ్‌కు 8 పాయింట్లు, త్రిగుణ్ టీమ్‌కు 5 పాయింట్లు వచ్చాయి. అయితే, ఇద్దరు డిక్టేటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో బిగ్‌బాస్ ఆ టాస్క్‌ను రద్దు చేశాడు. దీంతో ముఖేశ్ టీమ్‌కు దక్కాల్సిన విజయం చేజారిపోయింది. ఈ అంశంపై నాగార్జున మాట్లాడుతూ.. సంచాలక్‌గా ఉన్న వర్షిణి తన నిర్ణయంపై గట్టిగా నిలబడి ఉంటే ముఖేశ్ టీమ్ గెలిచే అవకాశం ఉండేదని పేర్కొన్నాడు. సంచాలక్ శివ తప్పిదం జరిగిందని చెప్పినప్పుడు వినకుండా ‘షటప్’ అంటూ సమాధానం ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. ఎదుటివారు చెప్పేది వినకుండా ఆవేశంగా స్పందించడం వల్ల టీమ్ మొత్తం విజయాన్ని కోల్పోయిందని వర్షిణికి వివరించాడు. దీంతో ఆమె తన నిర్ణయం వల్ల టీమ్‌కు నష్టం జరిగిందని బాధపడినట్లు కనిపించింది. ఇక వర్షిణిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున తీవ్రంగా స్పందించాడు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న వంశీ.. మరోసారి అనుచితంగా మాట్లాడటాన్ని తప్పుబట్టి, వచ్చే వారం నేరుగా నామినేట్ చేశాడు. త్రిగుణ్‌ను ఉద్దేశించి అభ్యంతరకర పదం ఉపయోగించిన రామకృష్ణను కూడా నాగార్జున హెచ్చరించాడు. అతడితో త్రిగుణ్‌కు క్షమాపణ చెప్పించాడు. మరోవైపు, రామ్ ప్రసాద్ ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా అభినందించాడు. సరదాగా ఉండటమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తం చేయడం, కెప్టెన్సీ టాస్క్‌లో దూకుడుగా పోరాడటం, అవసరమైన చోట తన అభిప్రాయాన్ని చెప్పడం వంటి అంశాలను ప్రశంసించాడు.

ఇక వచ్చే వారం జరగనున్న చివరి కెప్టెన్సీ టాస్క్‌కు ముందు నాగార్జున ఓ కీలక ట్విస్ట్ ఇచ్చాడు. ముఖేశ్, వర్షిణిల్లో ఒకరే వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ల రేసులో నిలుస్తారని ప్రకటించి, ఇద్దరి మధ్య ఓ గేమ్ పెట్టాడు. ఇప్పటివరకు ఒకరికొకరు మద్దతుగా నిలిచిన ఈ ఇద్దరూ.. ఈసారి మాత్రం వ్యక్తిగతంగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పోటీలో ముఖేశ్ తన ఆటతీరుతో విజయం సాధించి వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ల రేసులో చోటు సంపాదించాడు. దీంతో వర్షిణి తీవ్ర నిరాశకు గురైంది. ఆమె బాధపడటం గమనించిన నాగార్జున.. ఇకపై స్నేహం కంటే తన ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఆడితేనే విజయం సాధించగలవని స్పష్టం చేశాడు. సీజన్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు హౌస్‌లో మరింత ఉత్కంఠను పెంచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

బిగ్‌బాస్ 10 డే 76 ప్రోమో 2: హౌస్‌మేట్స్ మధ్య కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసిన నాగ్

బిగ్‌బాస్ 10 డే 76 ప్రోమో 2: హౌస్‌మేట్స్ మధ్య కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసిన నాగ్

ట్యాగ్లు
బిగ్‌బాస్ 10బిగ్‌బాస్ డే 76నాగార్జునత్రిగుణ్ముఖేశ్కెప్టెన్సీ టాస్క్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!