

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఆదివారం ఎపిసోడ్‌కు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన తాజా చిత్రం ‘మైసా’లోని ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో ఆమె స్టేజ్‌పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున ఆమెకు స్వాగతం పలుకుతూ, పెళ్లి తర్వాత మరింత అందంగా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్ ఇచ్చారు. అందుకు రష్మిక నవ్వుతూ, తనలోని సంతోషమే అందుకు కారణమై ఉండొచ్చని సమాధానమిచ్చారు. విజయ్ దేవరకొండకు ఏ భాషలో ఐ లవ్ యూ చెబుతారని నాగార్జున సరదాగా ప్రశ్నించడంతో వేదికపై నవ్వులు విరిశాయి.
అనంతరం హౌస్‌మేట్స్‌తో రష్మిక సరదాగా ముచ్చటించారు. అమన్ మసూద్ తమ స్నేహితులంతా ఆమెను ‘వదిన’ అని పిలుచుకుంటారని చెప్పగా, తనను ‘రష్షీ’ అని పిలవొచ్చని రష్మిక చనువుగా చెప్పారు. మరోవైపు నాగార్జున కంటెస్టెంట్స్‌తో సినిమా డైలాగ్‌లను గుర్తించే గేమ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మగధీర సినిమా డైలాగ్‌కు సంబంధించిన టాస్క్‌లో దేబ్జానీ ఉత్సాహంగా పాల్గొనగా, ఆమె చేసిన పనిని చూసి నాగార్జున ‘మైసా’తో పోల్చారు. దీంతో రష్మిక కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తంగా రష్మిక రాకతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!