

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్టులతో ఉత్కంఠ కొనసాగుతోంది. సాధారణంగా వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఉంటుందని భావించే ప్రేక్షకులకు మిడ్‌వీక్ ఎలిమినేషన్ చర్చ మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం కంటెస్టెంట్లంతా హౌస్‌మేట్స్‌గా మారేందుకు వివిధ టాస్కుల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే రోహిత్, వంశీ ఓ టాస్క్‌లో విజయం సాధించి హౌస్‌మేట్స్‌గా మారారు. తాజాగా ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో గెలిచే మరో ఇద్దరు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
‘రన్ రాజా రన్’ టాస్క్ చిన్నతనంలో ఆడిన ఆటను పోలి ఉండేలా రూపొందించారు. ఒక వృత్తాకార ప్రదేశంలో కంటెస్టెంట్లు కూర్చోవాలి. ఒకరు చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చి మరో కంటెస్టెంట్‌ను టచ్ చేయాలి. టచ్ చేసిన వ్యక్తి తన స్థానంలో కూర్చునేలోపు మరో కంటెస్టెంట్‌ను పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో అమన్ డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. రాం ప్రసాద్ అమన్‌కు డేంజర్ బ్యాడ్జ్ ఇవ్వడం, ఆ సమయంలో రోహిత్ స్పందన చర్చకు దారితీసింది. అయితే ప్రోమోలో చూపించిన మాటలు అదే సందర్భంలో అన్నవేనా? లేక మరో సందర్భంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి చూపించారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఈ వ్యవహారం అమన్, రోహిత్ మధ్య విభేదాలకు దారితీసేలా కనిపిస్తోంది. డేంజర్ బ్యాడ్జ్ ఇచ్చే సమయంలో రోహిత్, షాలినీ తనను ‘కరెక్ట్’ అన్నారని అమన్ ప్రశ్నించినట్లు ప్రోమోలో కనిపించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ఇతరులు చెప్పిన మాటల ఆధారంగా కాకుండా, తనకు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా అడగాలని సూచించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంలోనూ చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా అగ్ని పరీక్ష టీమ్‌లోని సభ్యులను విడదీసే వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది. ఇక లీకుల ప్రకారం ఝాన్సీ తొలి రౌండ్‌లోనే టాస్క్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాం ప్రసాద్ టాస్క్‌లో గెలిచి మూడో హౌస్‌మేట్‌గా మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వీకెండ్‌కు ముందే మరో ఎలిమినేషన్ లేదా సీక్రెట్ రూమ్ ట్విస్ట్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!