

తాజా ప్రోమోతో బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో తొలివారంలోనే మహా పరీక్ష మొదలైంది. మొత్తం 16 మంది సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా ఉండేందుకు అనర్హులుగా భావిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో రెడ్ టీమ్ నుంచి రాం ప్రసాద్, బ్లూ టీమ్ నుంచి చరణ్ ఎంపికయ్యారు. వీరిద్దరినీ హై రిస్క్‌లో ఉంచడంతో ఏ క్షణంలోనైనా హౌస్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రక్రియలో భాగంగా హై రిస్క్‌లో ఉన్న ఇద్దరిపై నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఇంటి నుంచి బయటకు పంపాలనుకున్న వ్యక్తి ముఖంపై రంగు పూసి, అందుకు కారణం చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. మొదట త్రిగుణ్ చరణ్‌కు రంగు పూశాడు. ఒక టీమ్‌కు నాయకుడిగా ఉన్న రాం ప్రసాద్ తనకు తాను రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పాడు. అయితే సృష్టి మాత్రం నాయకుడు తనకు తానే రిస్క్ తీసుకోవడం తనకు నచ్చలేదని పేర్కొంది.
మరోవైపు రాం ప్రసాద్‌పై షాలిని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వినోదం అనే ముసుగు వేసుకుని ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు సృష్టించాడని ఆరోపించింది. తనపై యాటిట్యూడ్ ఎక్కువగా ఉందని రాం ప్రసాద్ అన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. ఇదే సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో చరణ్, రోహిత్ అతడిని ప్రశ్నించారు. అగ్నిపరీక్షను తక్కువ చేసి మాట్లాడటం ఎందుకని రోహిత్ నిలదీయగా, మద్దతు ఇవ్వకపోయినా ఇతరులను తక్కువ చేసి మాట్లాడవద్దని షాలిని కౌంటర్ ఇచ్చింది.
ఇక త్రిగుణ్ గతంలో అగ్నిపరీక్షను తక్కువ చేసి మాట్లాడిన వ్యాఖ్యలపై వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించిన కంటెస్టెంట్లను నాగార్జున గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. తాజా నామినేషన్‌లో చరణ్‌కు ఎక్కువ మంది సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో అతడే ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కృష్ణుడు కూడా చరణ్‌ను నామినేట్ చేస్తూ, గ్రూప్‌గా కాకుండా ఒంటరిగా ఆడాలని సూచించాడు. త్రిగుణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!