

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల నేతల రాక ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో ప్రపంచంలోని పలు దేశాల నేతలు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పరస్పర సహకారం, నిర్మాణాత్మక చర్చలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు రానున్న పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ నేడు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీల్లో ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు పరస్పర ప్రయోజనాలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై సభ్య దేశాలు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!