

యాంకర్, నటి ఉదయ భాను తన కెరీర్‌లో ఎదురైన పరిస్థితులపై భావోద్వేగంగా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే తాను ఇండస్ట్రీలో లేకుండా పోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలు వస్తున్నప్పటికీ తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా, కేవలం తెలంగాణ నేపథ్యం ఉన్నంత మాత్రాన అవకాశాలు రావని చెప్పారు. తెలంగాణ ఏర్పడకముందు తాను ఎన్నో షోలు చేశానని, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలకు కూడా తనను హోస్ట్‌గా ఎంపిక చేయలేదని తెలిపారు. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు తనకు వచ్చిన అడ్వాంటేజ్ జీరో అని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు దేవుడు ఎంతో టాలెంట్ ఇచ్చాడని, దాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఉదయ భాను చెప్పారు. సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కథలు నచ్చక తానే కొన్ని సినిమాలను వదులుకున్నానని తెలిపారు. రాజశేఖర్ సాంగ్ తర్వాత తనకు చాలా పాటల్లో అవకాశాలు వచ్చాయని, అయితే తాను కొన్ని హద్దులు పెట్టుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ప్రొడక్షన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పలేదని స్పష్టం చేశారు. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ వారి టాలెంట్‌ను ప్రోత్సహించడమే తన లక్ష్యమని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!