

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య గొడవలు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సెప్టెంబర్ 10 ఎపిసోడ్‌లో గిన్నెలు కడిగే బాధ్యత విషయంలో మొదలైన వాగ్వాదం క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. రోహిత్‌కు గిన్నెలు కడిగే బాధ్యత ఇవ్వడంతో త్రిగుణ్ అతను కడిగిన గిన్నెలను పదేపదే పరిశీలించాడు. గిన్నెలు కనిపించినప్పుడు చెప్పాలని, తాను వచ్చి కడుగుతానని రోహిత్ చెప్పినా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
ఆ తర్వాత రోహిత్ చదువు, మార్కులు, ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై కూడా చర్చ జరిగింది. దీనికి రోహిత్ కౌంటర్ ఇస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి సామర్థ్యం ఏంటో తెలుస్తుందని, రూల్స్ పాటిస్తూ గేమ్ ఆడాలని అన్నాడు. ఈ క్రమంలో త్రిగుణ్ రోహిత్ బాడీ గురించి స్టెరాయిడ్స్ ఉపయోగించాడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో రోహిత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన శరీరంపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రశ్నించాడు. అనంతరం చరణ్‌తో ఈ విషయాన్ని చర్చించాడు. మరోవైపు రోహిత్ కడిగిన గిన్నె విషయంలోనూ ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ‘స్క్రిప్ట్’ అనే పదం చుట్టూ కూడా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. త్రిగుణ్ పదేపదే రోహిత్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. గేమ్‌లో భాగంగా విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేయడం వేరు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!