

బిగ్‌బాస్ తెలుగు 10 తాజా ఎపిసోడ్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిచెన్‌లో గిన్నెలు కడిగే బాధ్యత విషయంలో మొదలైన వివాదం క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. రోహిత్ గిన్నెలు సరిగ్గా శుభ్రం చేయడం లేదంటూ త్రిగుణ్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రోహిత్ తన పని తాను చేసుకుంటానని చెప్పినా.. వాగ్వాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో త్రిగుణ్ రోహిత్ శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ, అతడి బాడీని ‘స్టెరాయిడ్స్ బాడీ’గా పేర్కొన్నాడు. దీంతో ఈ అంశం హౌస్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశమైంది.
త్రిగుణ్ వ్యాఖ్యలపై రోహిత్ తన సహచరులతో మాట్లాడాడు. తన శరీరం గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. త్రిగుణ్ ఎంతగా రెచ్చగొట్టినా తాను సాధ్యమైనంత వరకు సంయమనంతోనే స్పందించినట్లు ఎపిసోడ్‌లో కనిపించింది. గతంలోనూ బాడీపై వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో బిగ్‌బాస్ హౌస్‌లో వివాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈసారి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున్ ఈ అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున్ క్లాస్ తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!