11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

Writer: Pooja 11:29 PM, 10 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరు సెలబ్రిటీలు వర్సెస్‌ కామనర్స్‌గా బ్లూ టీమ్‌, రెడ్‌ టీమ్‌లుగా విడిపోయి గేమ్‌ ఆడుతున్నారు. షో ప్రారంభమై కొద్ది రోజులే కావడంతో కంటెస్టెంట్ల బలాబలాలపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం కష్టమే. అయితే హీరో అదిత్‌ అరుణ్‌ అలియాస్‌ త్రిగుణ్‌ తన మాట తీరు, దూకుడైన ప్రవర్తనతో హౌస్‌లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రోహిత్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నాడనే విమర్శలు ఉన్నప్పటికీ, త్రిగుణ్‌ మంచి వినోదాన్ని అందిస్తున్నాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్ల ఎంట్రీ ముందుగానే ఉండొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలను కలిపి మొత్తం ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలుగా హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ‘బిగ్‌ అగ్ని పరీక్ష 2’లో పాల్గొన్న దీపక్‌, మితిలేష్‌, రామకృష్ణ, అపూర్వలో ఇద్దరికి మెయిన్‌ కంటెస్టెంట్లుగా అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. వీరిలో రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమనే టాక్‌ ఉండగా, మితిలేష్‌ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అపూర్వకు మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.

సెలబ్రిటీ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీల విషయానికి వస్తే, ఈసారి ఎక్కువ మంది మహిళా కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటి సీరత్‌ కపూర్‌తో పాటు ‘మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ ఫేమ్‌ సోనియా, ఆషిక, సీరియల్‌ నటి సౌందర్య రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక పురుష కంటెస్టెంట్లలో జబర్దస్త్‌ నూకరాజు, రాకింగ్‌ రాకేష్‌ను బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదించినట్లు టాక్‌ ఉంది. వీరు కూడా షోలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే వీరి ఎంట్రీపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగువైల్డ్‌కార్డ్ ఎంట్రీత్రిగుణ్తెలుగు రియాలిటీ షోటెలివిజన్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు
జనరల్

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయాలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!