11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

Writer: Chandrika 11:13 AM, 11 సెప్టెంబర్, 2026
క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు ముదరడం మదుపర్లలో ఆందోళన పెంచింది. చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్లు పతనమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 622 పాయింట్లు కోల్పోయి 74,268 వద్ద, నిఫ్టీ 221 పాయింట్లు తగ్గి 23,256 వద్ద కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.79గా నమోదైంది. నిఫ్టీలో ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉండగా.. హిందాల్కో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

మరోవైపు ముడిచమురు ధరలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ-హూతీ ఘర్షణలు మరింత ముదరడం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపింది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 108.77 డాలర్లకు చేరి నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఒక్క వారంలోనే బ్రెంట్‌ ధర 12 శాతానికి పైగా పెరిగింది. చమురు ధరల పెరుగుదలతో భారత్‌ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. శుక్రవారం ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూల ధోరణి కొనసాగడం దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

రాగి ధరలకు రికార్డు

రాగి ధరలకు రికార్డు

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ట్యాగ్లు
స్టాక్‌మార్కెట్దేశీయమార్కెట్లుసెన్సెక్స్నిఫ్టీముడిచమురుబ్రెంట్‌క్రూడ్పశ్చిమాసియాఉద్రిక్తతలురూపాయివిలువషేర్‌మార్కెట్చమురుధరలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..