

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31 ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు సేఫ్ అయ్యే అవకాశం కల్పించే టాస్క్‌తో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్‌బాస్ హెచ్చరించడంతో నామినేట్ అయిన దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణిలో టెన్షన్ మొదలైంది. ఎండిపోయిన చెట్టుపై ఉన్న వారి ఫొటోలను వికసించిన చెట్టుపైకి మార్చేందుకు టాస్కుల్లో గెలవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఈసారి ఎలిమినేషన్‌లో ప్రేక్షకుల ఓట్లతో పాటు టాస్కుల్లో గెలుపు కూడా కీలకంగా మారింది.
అమన్-త్రిగుణ్, రోహిత్-షాలినీ, అపూర్వ-చరణ్, నరేష్-రాంప్రసాద్, ముకేశ్-ఝాన్సీ జంటలుగా పోటీ పడగా, వర్షిణి-సుధీర్ సంచాలకులుగా వ్యవహరించారు. అపూర్వ-చరణ్ జోడీ విజయం సాధించగా, రోహిత్-షాలినీ ఓటమి పాలయ్యారు. అనంతరం గ్రూప్‌లో తనకు సరైన స్వాగతం లభించడం లేదంటూ అపూర్వ అసహనం వ్యక్తం చేయడంతో షాలినీతో వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో త్రిగుణ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు సుధీర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గతంలో తాను చేసిన వ్యాఖ్యపై అపూర్వ వివరణ ఇచ్చింది. ఆ మాటను సరదాగా అన్నానని చెప్పినా, చర్చ కొనసాగడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ఇదే సమయంలో నరేష్, వర్షిణి కలిసి చేసిన టైటానిక్ సన్నివేశం హౌస్‌లో నవ్వులు పూయించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!