

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న వాయిదా పడినప్పటికీ ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడంతో, డీలిమిటేషన్ బిల్లుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రత్యేక సమావేశం లేదా ప్రస్తుత సమావేశాలను తిరిగి సమావేశపరిచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై డీలిమిటేషన్ ప్రభావం గురించి చర్చ కొనసాగుతోంది. ఆగస్టు 20న మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ వాటా తగ్గకూడదని స్పష్టం చేశారు. దక్షిణాది వాటాకు రక్షణ ఉంటే డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు తగ్గే అవకాశం ఉందనే రాజకీయ చర్చ కూడా సాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!