

దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. ఈ అవకాశం అక్టోబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ముడి చక్కెరపై ఉన్న 100 శాతం దిగుమతి సుంకం ఈ ప్రత్యేక కోటాకు వర్తించదు.
చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. మిఠాయి తయారీదారులు, శీతల పానీయాల సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు వంటి బల్క్ వినియోగదారులు 15 రోజులకు మించి చక్కెర నిల్వ ఉంచకుండా సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పరిమితి విధించింది. ఈ చర్యల ద్వారా అక్రమ నిల్వలు, ఊహాజనిత కొనుగోళ్లు, కృత్రిమ కొరతను అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
10 లక్షల టన్నుల దిగుమతి కోటాకు అర్హత కలిగిన చక్కెర మిల్లులు, రిఫైనరీల నుంచి ఆగస్టు 21 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ముడి చక్కెరను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దిగుమతుల వల్ల దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే సముద్ర రవాణా కారణంగా దిగుమతుల ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!