
రాజకీయాలు

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనని జగన్ భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు, వాటి విధివిధానాలపై కనీస అవగాహన లేకుండానే జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
తన పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయిన జగన్.. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రావడం లేదని లోకేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఒకటేననే భావన కలిగించేలా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను లోకేశ్ తన ‘ఎక్స్’ పోస్టులో షేర్ చేశారు. కాగా, డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీకి సంబంధించిన అంశాలపై వైసీపీ, ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!