
జనరల్

రాందేవ్ బాబా తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె రాందేవ్ బాబాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన యవ్వన జీవితం, వ్యక్తిగత విషయాల గురించి పగటి కలలు కనొద్దని సూచించారు. తనకు శీలం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, తన శీలం మెరుగైనదేనని కంగనా వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా యువతను ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడంపై కంగనా అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ఔషధ ప్రకటనల విషయంలో తాను ఎప్పుడూ సుప్రీంకోర్టు మందలింపులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలు కూడా గమనించాలని ఆమె సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!