

మాజీ మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన అరుదైన ఫుట్‌బాల్ జ్ఞాపికలు వేలంలో భారీ ధరలు పలికాయి. 2012లో బార్సిలోనా తరఫున లియోనెల్ మెస్సీ ధరించిన, సంతకం చేసిన జెర్సీ ఏకంగా 66,107 డాలర్లకు (సుమారు రూ.56.4 లక్షలు) అమ్ముడైంది. అదే వేలంలో క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్ మాడ్రిడ్ జెర్సీ 10,601 డాలర్లకు (సుమారు రూ.9.05 లక్షలు) విక్రయమైంది. మెస్సీ జెర్సీ రొనాల్డో జెర్సీ కంటే ఆరు రెట్లకు పైగా ధర పలకడం విశేషం.
ఈ జెర్సీ వెనుక ఆసక్తికరమైన జ్ఞాపకం ఉంది. 2012లో బార్సిలోనా–మాంచెస్టర్ యునైటెడ్ ప్రీ-సీజన్ మ్యాచ్‌కు ముందు థార్న్‌లే.. బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పికేతో మెస్సీ జెర్సీని ఇప్పించాలని కోరారు. మ్యాచ్ అనంతరం పికే ఆయనను బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లగా, మెస్సీ తాను ధరించిన జెర్సీని తీసి సంతకం చేసి థార్న్‌లేకు బహుమతిగా ఇచ్చారు. మెస్సీ స్వయంగా అందించిన ఈ అరుదైన జ్ఞాపకం, జెర్సీ మ్యాచ్‌లో ధరించినదే కావడం, సంతకం ఉండటం దాని విలువను మరింత పెంచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!