

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ సుస్మిత వ్యాఖ్యలను ఖండించారు. తల్లి కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్వర్ణ అన్నారు. పార్టీ అధిష్ఠానం కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తావులేదని పలువురు మహిళా నాయకులు స్పష్టం చేశారు. సుస్మితకు పార్టీపై లేదా సీఎం నాయకత్వంపై ప్రశ్నించే ముందు పార్టీ కార్యకలాపాల్లో తన పాత్రను పరిశీలించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ సారయ్య ఎమ్మెల్యే టికెట్ అడిగినంత మాత్రాన లభించే విషయం కాదని వ్యాఖ్యానించగా, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుస్మిత వ్యాఖ్యలు చేసిన సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!