

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష 2’ నిర్వహిస్తున్నారు. రెండో రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లకు కఠినమైన టాస్కులు ఇచ్చారు. మొదటి టాస్క్‌లో వారం రోజులుగా కుళ్లిన చెత్త దుర్వాసనను భరిస్తూ లాక్ ఓపెన్ చేసే కీని వెతికి, అందులోని జ్యూస్‌ను తాగాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో అమన్, షాలినీ పోటీపడగా.. స్వల్ప తేడాతో షాలినీ విజయం సాధించి టాప్ 15లో చోటు దక్కించుకుంది.
రెండో టాస్క్‌లో మాజీ ప్రేమికుడికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పడంతో పాటు ‘ఐ లవ్యూ’ చెప్పాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో శ్రష్టి ముందుగా బెల్ కొట్టి అవకాశం దక్కించుకుని, తన మాజీ ప్రియుడితో మాట్లాడింది. ఆమె ప్రయత్నాన్ని అభిజిత్, నవదీప్, బిందు మాధవి ప్రశంసించగా.. ఆమె టాప్ 15లో స్థానం సంపాదించింది. మరో టాస్క్‌లో కృష్ణ నుదుటిపై ‘తూ నా బతుకు’ అనే టాటూ వేయించుకుని టాప్ 15లోకి వెళ్లాడు. హెయిర్‌కట్ టాస్క్‌లో భాగి అబ్బాయిల తరహాలో చిన్న జుట్టు కట్ చేయించుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
చివరి దశలో రెండు ‘టాప్ 15’ కార్డులు, రెండు ‘ఎగ్జిట్’ కార్డులు ఉంచి హేమంత్, వెంకటేశ్‌లకు అవకాశం ఇచ్చారు. ఇద్దరికీ ఎగ్జిట్ కార్డులు రావడంతో బురద టాస్క్ నిర్వహించారు. ఇందులో హేమంత్ గెలిచి పోటీలో కొనసాగగా.. వెంకటేశ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎపిసోడ్ ముగిసే సమయానికి పలువురు కంటెస్టెంట్లు టాప్ 15లో స్థానం దక్కించుకున్నారు. మిగిలిన స్థానాలు తదుపరి టాస్కులతో భర్తీ కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!