

‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘ఇరుముడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విడుదల నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. హీరోల సినిమా ఎంపిక విధానంలో ప్రస్తుతం గణనీయమైన మార్పు వచ్చిందని శివ నిర్వాణ అన్నారు. రామ్‌చరణ్ ‘రంగస్థలం’ వంటి విభిన్న చిత్రంతో విజయాన్ని అందుకోవడం వల్ల కథలో బలం ఉంటే ఎలాంటి సినిమా చేయడానికైనా హీరోలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
అఖిల్ ‘లెనిన్’ వంటి విభిన్న కథతో విజయాన్ని అందుకోవడం కూడా ఈ మార్పుకు ఉదాహరణగా చెప్పొచ్చని శివ నిర్వాణ తెలిపారు. తాను నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ వంటి హీరోలను తరచూ కలుస్తుంటానని, వారంతా కొత్త పాయింట్, సరికొత్త కథనంతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం హీరోలు దర్శకులకు ఎక్కువగా షరతులు విధించడం లేదని, ప్రత్యేకంగా హీరో ఎలివేషన్ సన్నివేశాలు లేదా అనవసరమైన అంశాలు ఉండాలని కోరుకోవడం లేదన్నారు. మంచి కథ, బలమైన కథనం ఉంటే చాలని హీరోలు భావిస్తున్నారని శివ నిర్వాణ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!