

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయని అన్నారు. మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ భావ దారిద్ర్యం, దారుణమైన పాలన కనిపిస్తోందని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణను అభివృద్ధి చేశారని, రాష్ట్రాన్ని బలమైన స్థాయికి తీసుకెళ్లారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ₹2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే తీసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని విమర్శించారు. పెట్టుబడిదారులను బెదిరించడం, అవినీతి ఆరోపణలతో రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!