
రాజకీయాలు

త్వరలో జరగనున్న స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించవద్దని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్‌ఐయూ) విద్యార్థులు లేఖ రాశారు. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీఐ చైర్మన్ తీరును విమర్శించారు.
ఇది దేశంలో శక్తిమంతమైన వ్యవస్థలతో విభేదించే స్వేచ్ఛకు సంబంధించిన అంశమని విద్యార్థులు పేర్కొన్నారు. తమ వృత్తి జీవితంపై భయం లేకుండా అధికారులతో విభేదించే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. నల్సార్ విద్యార్థులు స్ఫూర్తివంతమైన ధైర్యసాహనాలు, నైతిక నిబద్ధత కనబరిచారని ప్రశంసించారు. వారికి బేషరతుగా సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!