

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం భోగాపురం చేరుకోనుండగా, 7.30 గంటలకు భోగాపురం నుంచి హైదరాబాద్‌కు మరో ఇండిగో సర్వీసు బయలుదేరనుంది. అదే సమయంలో బెంగళూరు నుంచి ఉదయం 7.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం భోగాపురంలో ల్యాండ్ కానుండగా, 8 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరనుంది.
భోగాపురం నుంచి హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి నగరాలకు ఇండిగో తొలి రోజున 31 సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇతర విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసుల షెడ్యూళ్లను విడుదల చేస్తున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయ సేవలు ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న నేపథ్యంలో, అక్కడి నుంచి నడిచే విమాన సర్వీసులను భోగాపురం విమానాశ్రయానికి తరలించనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!