
సినిమాలు

గాంధీ భవన్‌లో ఎంపీ అనిల్ యాదవ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అరవింద్ వెటకారంగా, చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురించి తెలిసి కూడా అలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి టీపీసీసీ అధ్యక్షుడి స్థాయికి మహేష్ కుమార్ గౌడ్ ఎదిగారని పేర్కొన్నారు.
అరవింద్ విమర్శలు చేస్తే రాజకీయంగా మార్కులు పడతాయని భావిస్తున్నారని అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు తన రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర అరవింద్‌దేనని విమర్శించారు. బీజేపీ బీట్ రిపోర్టర్లను అడిగితే అరవింద్ రాజకీయ చరిత్ర ఏమిటో తెలుస్తుందని అనిల్ యాదవ్ అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!