

ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ జస్బీర్ సింగ్ తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఒప్పోతో పాటు వన్‌ప్లస్, రియల్‌మీ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు వెల్లడించారు.
ఉత్పత్తి ప్రారంభించిన తొలి ఏడాదిలోనే సుమారు 80 లక్షల స్మార్ట్‌ఫోన్ యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జస్బీర్ సింగ్ తెలిపారు. ఇందుకోసం ఒప్పో మొబైల్ ఇండియాతో ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. మరోవైపు, డిక్సన్ టెక్నాలజీస్‌తో కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు వివో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేశీయంగా స్మార్ట్‌ఫోన్ తయారీని మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యాలు దోహదపడనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!