

జపనీస్ మార్షల్ ఆర్ట్స్ అయిన కెంజుట్సులో అధికారిక ప్రవేశం సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దశాబ్దాల పాటు క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్‌ను అభ్యసించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ప్రజా జీవితం, సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ యుద్ధకళలలో అంకిత భావంతో సాధన చేయడం యువతకు బలమైన సందేశమని తెలిపారు. శారీరక బలం మాత్రమే కాకుండా మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరమయ్యే యుద్ధకళలను అనుసరించడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి పంపిన అభినందన సందేశం తనకు గొప్ప గౌరవమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. యుద్ధకళలు శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రత, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ప్రజలకు మరింత అంకిత భావంతో సేవ చేయాలన్న తన సంకల్పాన్ని బలపరుస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!