
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పలుప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!