

పూలే సినిమా ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి వీక్షించారని తెలిపారు. పూలే జీవితం, ఆయన ఆలోచనలు, సమాజ సంస్కరణల కోసం చేసిన పోరాటాన్ని తెరపై ఆవిష్కరించినందుకు చిత్ర బృందానికి, ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమా భారతీయ సమాజానికి గొప్ప సందేశాన్ని అందించే చిత్రమని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళల విద్య, సాధికారత కోసం జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే చూపిన ప్రత్యేక శ్రద్ధ ఎంతో ఆదర్శనీయమని అన్నారు. మహిళలతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో కష్టాలు భరించి సమ సమాజ స్థాపనకు వారు చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. పూలే దంపతులు వేసిన పునాదులపై వారి ఆశయాలు, లక్ష్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!