

అన్నా కొణిదెల, పవన్ కల్యాణ్ భార్య, తన జీవితంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టును పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఏడు సంవత్సరాల వయసులో సెయింట్ పీటర్స్బర్గ్లో లూడ్విగ్ వాన్ బీథోవెన్ స్వరపరిచిన “లా మర్మోట్”ను వాయించిన సందర్భాన్ని గుర్తుచేశారు. ఐదేళ్ల వయసులోనే వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించి, చదువుతో పాటు పదిహేనేళ్ల వయసు వరకు సంగీత విద్యను కొనసాగించినట్లు తెలిపారు.
భారతదేశానికి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ తనకు పియానో కొనిచ్చారని అన్నా వెల్లడించారు. ఇటీవల సంగీతాన్ని ఎక్కువగా వాయించకపోయినా, తనలోని సంగీతం ఇంకా సజీవంగా ఉందని, సరైన సమయాన్ని ఎదురుచూస్తోందని చెప్పారు. సంగీతం భాషలకు అతీతమై ప్రేమ, బాధ, ఆనందం వంటి భావాలను కలిపే గొప్ప శక్తిగా పనిచేస్తుందని, ప్రపంచాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చే వారధిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!