

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా చేరే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను రద్దు చేసి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని కొనసాగించాలని భావిస్తోంది. గత మూడేళ్ల వేసవి గణాంకాల ప్రకారం మే, జూన్, జులై నెలల్లో నెలకు సగటున 23-24 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం వీఐపీ దర్శనాల కోసం రోజుకు 2-3 గంటలు కేటాయిస్తుండగా, ఈ సమయంలో కేవలం 3,800 మంది మాత్రమే దర్శనం పొందుతున్నారు. అదే సమయాన్ని సాధారణ భక్తులకు కేటాయిస్తే దాదాపు 15 వేల మందికి దర్శన భాగ్యం కలుగుతుందని అంచనా. కొత్త విధానంతో ప్రస్తుతం 22-23 గంటలుగా ఉన్న నిరీక్షణ సమయం 8-12 గంటలకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పద్ధతిలో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.





.jpeg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!