

హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ నగరం, నిజాం కాలం నుండి ఇప్పటివరకు అభివృద్ధి పథంలో నిరంతరం ముందుకే సాగుతోంది. ప్రభుత్వాలు మారినా, హైదరాబాద్ ఎదుగుదల మాత్రం ఎక్కడా తగ్గలేదని ఈ నగర జీవనం చెబుతోంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడటానికి ప్రధాన కారణాలు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం, జీవన వ్యయాలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువగా ఉండటం.
సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. నార్త్ ఇండియా నుంచి కూడా పెద్ద సంఖ్యలో టెకీలు, ఉద్యోగులు ఇక్కడే సెటిల్ అవుతున్నారు. కొంతమంది నిర్మాణ రంగం వంటి విభాగాల్లో కూడా మంచి అవకాశం పొందుతున్నారు. ఈ అభివృద్ధి వాతావరణం నేపథ్యంలో, హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది.
2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్‌లో ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ నగరాల జాబితాలో హైదరాబాద్ 82 వ స్థానాన్ని పొందింది. ఐటి రంగం, జీవన సౌకర్యాలు, నగర అభివృద్ధి వంటి ప్రధాన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ప్రకటించారు. ఈ జాబితాలో బెంగళూరు 29 వ స్థానంతో ముందంజలో ఉండగా, ముంబై 40 వ స్థానంలో, ఢిల్లీ 54 వ స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్ 82 వ స్థానంలో చోటుదక్కించుకోవడం నగర ప్రతిష్టను మరింత పెంచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!