

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. దేశ పాలనలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రభావం పెరిగిందని, కీలక నిర్ణయాల ప్రక్రియలో తనను పక్కన పెడుతున్నారనే అసంతృప్తితో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పరిపాలనా వ్యవహారాల్లో అధ్యక్షుడి పాత్ర తగ్గిపోతుందనే ఆరోపణలు కూడా వినిపించాయి.
అయితే ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా చేయలేదని, ఆయన తన విధులను యథావిధిగా కొనసాగిస్తున్నారని స్పష్టం చేసింది. అధ్యక్షుడి కార్యాలయ అధికారులు కూడా ఈ ప్రచారాన్ని అసత్యమని పేర్కొంటూ, దేశ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఆయన పని చేస్తున్నారని వెల్లడించారు. ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!