

శాంతి ఒప్పందం కుదిరే దశలో ఉందనుకున్న సమయంలో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా దళాలు ఇరాన్ ని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు జరిపాయి. తమ ఎంక్యూ-1 డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయడం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు పేర్కొంది.
ఇక సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్లపై అమెరికా దాడులు జరిపిందని ఇరాన్ ఐఆర్‌జీసీ ఆరోపించింది. దీనికి ప్రతిగా అమెరికా వాడిన ఎయిర్‌బేస్‌పై తాము ప్రతిదాడి చేసినట్లు తెలిపినా, ఆ స్థలం వివరాలు వెల్లడించలేదు. ఇదే సమయంలో కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిని నియంత్రించడంలో ఖేష్మ్ ద్వీపం కీలకంగా ఉండగా, అక్కడ అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు భద్రపరిచినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!