

జూన్ నెల ప్రారంభమవడంతో పాటు బ్యాంకు ఖాతాదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జూన్ 2026లో దేశవ్యాప్తంగా మరియు ప్రాంతీయంగా కలిపి బ్యాంకులు మొత్తం 11 రోజులు మూసివేయబడనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం జూన్ 7, 14, 21, 28 తేదీలలో వచ్చే ఆదివారాలు, అలాగే జూన్ 13 రెండో శనివారం, జూన్ 27 నాల్గవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఈ ఆరు రోజులు అన్ని బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి.
అదనంగా కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించబడ్డాయి. జూన్ 15న మిజోరాంలోని ఐజ్వాల్, ఒడిశాలోని భువనేశ్వర్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సందర్భంగా సెలవు ఉండగా, జూన్ 26న హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. జూన్ 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ ఉండే అవకాశం ఉన్నందున ఖాతాదారులు తమ అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంలు, ఎన్ఈఎఫ్‌టీఈ, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!