

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు, భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు మరియు హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జూలైలో WEF ఫాలో-అప్ సమావేశం నిర్వహించే ప్రతిపాదనలపై చర్చించారు.
దావోస్‌లో జరిగే చర్చలు, నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం ఎంతో ఉపయోగకరమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు WEF బృందం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగస్వామ్యం వహిస్తామని జెరెమీ జర్గెన్స్ స్పష్టం చేస్తూ, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!