
గాసిప్స్

విజయ్, త్రిష కృష్ణన్ ఒకే కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటుడు అజిత్ కుమార్ను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈ దృశ్యం కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. వీడియో వెలుగులోకి రావడంతో అభిమానులు, నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో నేపథ్యంలో విజయ్, త్రిషల మధ్య సంబంధంపై కొందరు సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం సహనటులు కలిసి ప్రయాణించడం సాధారణ విషయమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వైరల్ వీడియోతో కోలీవుడ్‌కు చెందిన ఈ ఇద్దరు స్టార్‌లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!