

ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మెగా ఫైనల్‌పై వర్షం ముప్పు నెలకొనడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌తో పాటు రిజర్వ్ డే కూడా పూర్తిగా వర్షార్పణమై ఎలాంటి ఫలితం తేలకపోతే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా నిలవగా, గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో రెండు రోజులు ఆట జరగని పరిస్థితి వస్తే ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే అభిమానులు మాత్రం నిబంధనల ద్వారా కాకుండా మైదానంలో పోరాడి విజేతను నిర్ణయించాలని కోరుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!