
సినిమాలు

కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కన్యాకుమారి వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వచ్చే మూడు రోజులు మిశ్రమ వాతావరణం కొనసాగనుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, వడగాల్పుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటలను భద్రపరచుకోవాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకూడదని అధికారులు తెలిపారు.














.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!