
రాజకీయాలు

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Q4లో కంపెనీ నికర లాభం రూ.16,971 కోట్లు నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 12.5 శాతం తగ్గుదలగా నమోదైంది. అంతేకాకుండా గత త్రైమాసికంతో పోలిస్తే కూడా లాభాలు తగ్గడం గమనార్హం.
చమురు మరియు రసాయన విభాగాల్లో ఎదురైన ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఆదాయం రూ.3.03 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ రూ.80,775 కోట్ల లాభాన్ని నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించింది. త్రైమాసికంలో తగ్గుదల ఉన్నప్పటికీ వార్షికంగా కంపెనీ బలమైన పనితీరు కనబరిచింది.


.jpg&w=3840&q=75)









.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!