

ప్రయాణాల్లో వాంతులు, వికారం కలగడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. కళ్లు, లోపలి చెవి, శరీరం పంపే సంకేతాల మధ్య సమన్వయం దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కదలికను లోపలి చెవి గుర్తించినా, కళ్లు స్థిరంగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టినప్పుడు మెదడు అయోమయానికి గురవుతుంది. దీంతో వికారం, వాంతులు, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లలు, మైగ్రేన్ ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు.
ఇది జబ్బు కాదు, శరీరం ఇచ్చే సహజ ప్రతిస్పందన మాత్రమే అని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణాల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, గాలి బాగా వచ్చేలా కూర్చోవడం, ఫోన్ లేదా పుస్తకాలు చూడకుండా దూర దృశ్యాలను చూడడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. లక్షణాలు తీవ్రమైనవిగా లేదా తరచుగా వస్తున్నట్లయితే సరైన వైద్య సలహా కోసం డాక్టర్లను సంప్రదించడం మంచిది.









_0.jpg.webp&w=3840&q=75)


.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!