

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ₹13,615 కోట్ల రుణాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పొందేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 30 నాటికి మెట్రో ప్రభుత్వ పరంగా మారే మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను షేర్ పర్చేజ్ ఒప్పందం ద్వారా 100 శాతం ఈక్విటీతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన గ్యారంటీ, అండర్‌టేకింగ్, ఇతర ఆర్థిక ఒప్పందాలకు కూడా ఆమోదం లభించింది.
ఈ రుణాన్ని 20 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం పూచీకత్తు ఇస్తోంది. మొత్తం ₹15,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకోనుండగా, అందులో ₹13,000 కోట్లు రుణం, ₹2,000 కోట్లు ఈక్విటీగా ఉన్నాయి. మిగిలిన నిధులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమకూర్చనుంది. నిర్వాహణలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించనున్నారు. అలాగే ఆర్థిక, చట్టపరమైన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పలు సిఫార్సులు చేస్తూ ప్రాజెక్ట్ స్వాధీనాన్ని సజావుగా పూర్తి చేయడానికి మార్గం సుగమం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!